1.
ఆకశం లో చందమామలా
నీ ప్రేమ నాపై కురవాలని
అస్తమించిన సూర్యుడిలా
నీ దరికి చేరానిలా
2.
నీ ప్రేమకై ఆరాటపడుతున్న ఈ మనసు
ఎప్పుడూ నీ ఊహలతోనే ఉలిక్కి పడుతోంది
ఈ మనసుల కలహానికి స్వస్తి చెబుదాం ప్రియా
నిన్నింతలా ప్రేమించే ప్రేమను నీ
హ్రుదయపు తలుపులు తెరిచి
ఆహ్వానిచలేవా చెలీ
3.
నిన్ను చేరాలని నిన్ను పొందాలని
మనసున పుట్టిన కోరిక నింగికెగిసిన
అలలా కలవర పెడుతోంది
యవ్వన వీదులలో తిరుగుతున్న
రంగుల గాలిపటంలా
ఎగురుతున్న
నీ ప్రేమను అందించి
ఆవేదన చెందుతున్న
ఈ ముగ్దను మన్నించుమా
4.
ప్రతి రాత్రి చివరి ఆలోచన నువ్వే
ప్రతి ఉదయపు మొదటి ఆలోచన నువ్వే
సంతోషమనిపించినా నువ్వే
బాదనిపించినా నువ్వే
నువ్వే నువ్వే నువ్వేలే ఓ మధు
5.
నిన్ను చేరాలని నిన్ను చూడాలని
నీ ప్రేమను అందుకోవాలని ఏదో ఆశ
నీ చూపుకి నోచుకోలేని నా ప్రేమ ఆవేదన
అక్షరాలకే పరిమితం అయిపోయింది
కాలం నీ కోసం ఆగదని తన నీడను
నీ నీడ వెనుకల జీవితాంతం నడవడానికి
ఆ నీడని పట్టుకోవాలి
ఆ నీడ నీ చేతికి దొరకదు
నీ చేజిక్కించుకునే ప్రయత్నం
మానకు సుమా అంటూ నా మనసును నేనే ఓదార్చుతున్న
ఓడిపోవడానికి ఇస్టపడని నేను జయించడానికి వీలుకాని నీ ప్రేమను
దక్కించుకోవడానికి నిరంతరం పోరాడుతునే ఉన్నా , అర్థం చేసుకుని నీ హ్రుదయం
అనే చెరసాలలో జీవిత ఖైదీని కానివ్వు
6.
శ్రీ శ్రీ అన్నట్టు
ప్రేమికుడు , సైనికుడు ఒకటే
ప్రేమికుడి మాట భావం
సైనికుడి తూటా
చేయల్సిందల్లా చేస్తూనే వుంటాయి
చేరాల్సిన చోటుకి చేరుతూనే వుంటాయి
7.
బొమ్మరిల్లు భాస్కర్ ఆరెంజ్ మూవిలో చెప్పినట్టు ప్రేమంటే మూడబ్బద్ధాలు నాలుగు
కుళ్ళు జోకులు కాకున్నా నిజంగానే అబద్ధాలు ఆడాల్సి వొచ్చేది
నేనెప్పుడు సంతోషంగా చూడాలనుకునే తన కళ్ళలో బాద చూడాల్సి వస్తుందేమో అన్న
భయం తో చెప్పిన అపద్ధాన్ని మోసం అనుకున్న తనకు ఎప్పుడు తన గురించే
అలోచించే నా మనసు ఆ సమయంలో నిజం కన్నా తనే ఎక్కువని చెప్పిందని చెప్పలేక
పొయా
8.
ఎదురు చూస్తునే వున్నా
వర్షాన్ని తెచ్చిన మబ్బులలా
వసంతాన్ని వెనుకెసుక్చిన కొయిలలా
ఏ కాలమో, ఏ అవకాశమో
తన ప్రేమను తిరిగి తీసుకురాదా అని
అయినా మనస్సంటుంది
"ఎంత అందమైన కల అయిన మెలుకువ తీరం దాటె వరకే" అని
9.
నిశీదిని చీల్చుకుంటు తన రూపంలో
భువికి వచింధా వెన్నెల…
బావిలొ దాక్కుందా కవల చందమామ
తన అందంతో పోటిపడలేనంటు
తనని కల్లో కుడా చుడని కళ్ల్ళేన
ప్రశాంతంగా నిద్రపొతుంటాయ్
రాత్రి కుడా కళ్ళార్పుతోందా
తన అందాన్ని చూడడానికే అన్నట్టు
చుక్కలు చూస్తున్నాయి
నది నవ్వుతోంది
ఒంటరిగా నదీ తీరంలో…ఇసుక తిన్నెల్లో
పక్షుల కిల కిల రాగల మధ్య... చందమామ సాక్షిగ
తన చిరుగాజుల సవ్వడితొ పాటు
తన నవ్వు విన్న క్షణం
తనని చూసి మనసు పారేసుకున్న క్షణం
మళ్ళీ మళ్ళీ రావాలి ఆ క్షణం
0 comments:
Post a Comment